జ్ఞాపకాల అలలతో ..
జ్ఞాపకాల అలలతో ..


గోదావరి అలలా
మంచు తుంపరలా
మెల్లగా అందంగా నడవటం
ముద్ద మందారంలా నవ్వడం ..
చిరుగాలిలా మనసును తాకడం
మనసులో ప్రేమ తుఫానులు రేపడం
నీకు మాత్రమే వచ్చు!!
నీ ప్రేమ తుఫానును తట్టుకొని నిలబడితే
జ్ఞాపకాల అలలతో మదిని తడి చేస్తావ్
నా కోసం నేనే దాచుకున్న క్షణాలన్నీ
నీ ఆలోచనలతో తుడిచేస్తావ్..