STORYMIRROR

RAMESH B L N

Drama Tragedy Inspirational

4  

RAMESH B L N

Drama Tragedy Inspirational

నాన్నంతే..

నాన్నంతే..

1 min
458

నాన్నంతే..

దసరాకు బట్టలు తీసుకో అంటే 

ఉగాదికి చూద్దాంలే అంటాడు

ఉగాదికి తీసుకో అంటే 

దసరాకు చూద్దాం అంటాడు..

తన పిల్లలకు మాత్రం 

ప్రతి పండక్కి బట్టలు కొంటాడు!!!


అరిగిన చెప్పులతో 

ఇంకో ఆర్నెల్లు గడిపేస్తాడు 

కానీ తన పిల్లలకు మాత్రం 

సూటు బూటు కొనిపెడటాడు..


తను రెక్కలు ముక్కలు చేసుకొని 

తన పిల్లలకు రెక్కలు వచ్చేలా చేస్తాడు 

రెక్కలొచ్చిన పిల్లలు ఎగిరిపోతే 

ఎదిగిపోయారు అని సంబరపడతాడు!!!


నాన్నంతే..

గొడుగులాంటోడు

ఎండకు నీడై 

వర్షానికి రక్షణై 

మనల్ని కాపాడి 

తాను మాత్రం ఒక మూలాన సర్దుకుంటాడు..


నాన్నంతే..

కుటుంబం కోసం కరగడమే తప్ప  

తనకోసం ఏమి ఆశించని  

పిచ్చి మారాజు!!!


 


 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama