STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

అంతరం

అంతరం

1 min
305

డబ్బున్న వాడు ఖర్చు పెట్టాలి

లేని వాడు తినాలి

సామెతలు బాగానే చెబుతాం


ఎవరు ఖర్చు పెడుతున్నారు

పోనీ పెట్టినా మనం ఏమంటున్నాం

అంత డబ్బు ఖర్చు ఎందుకు

విందులూ వినోదాలూ వృథా ఖర్చు అంటున్నాం


అసలు డబ్బున్న వాడు ఖర్చు పెట్టకపోతే

రెండు జతల బట్టలు చాలు అనుకుంటే

అటు డబ్బు దానం కాకుండా ఖర్చూ కాకుండా

అలానే ఉండిపోతే


ఉత్పాదకత కథలా ఉండిపోదూ

కొత్త పరిశ్రమలు ఆగిపోవూ

నిరుద్యోగం పెనుభూతం అవదూ

ఖర్చు పెట్టే విధానం మారాలి 

మనమైనా ఎవరైనా

ఆలోచించే విధానం మారాలి


అంతేగానీ ఖర్చు పెట్టకుండా 

కేవలం కబుర్లు చెప్పి

పేదరికం రూపు మాసిపోవాలని అనుకోవడం

ఇంకా ఎన్నాళ్ళు భ్రమలో ఉండాలో ఏమో



Rate this content
Log in

Similar telugu poem from Abstract