STORYMIRROR

Radha Krishna

Drama Romance Classics

4  

Radha Krishna

Drama Romance Classics

నా నీడే మన ప్రేమకు గొడుగు..❤️

నా నీడే మన ప్రేమకు గొడుగు..❤️

1 min
301

ఓ సఖా...🌹

నీకు తెలుసా...


నా మదిలో నీవు చేరిన మరు క్షణం నుండి

అణువణువు నీవై నిండి పోయావని.

నీ అభిమానాన్ని పంచుతూ నన్ను అనంత

ప్రేమ వాహినిలో ముంచెత్తావని.

నీ నిత్య సత్యమైన మాటలతో నన్ను

నీలో కట్టిపడేశావని.

నీ కొంటె చూపులతో చేసే పలకిరింపులు

నా తనువెల్లా ప్రేమ అక్షరాలను లిఖిస్తోందని.

ఇంకొక విషయం చెప్పనా...!

ఇంటి ఆవరణలోని లతలన్నీ బిడియంతో

నను అల్లుకుంటూ నీ రాకను నాకు తెలియ చేస్తున్నాయి.

పూలు వర్షంలా త్రోవంతా పరుచుకుని

నీ రాకకు ఆహ్వానం పలుకుతున్నాయి.

వాటికి జతగా... నేను కూడా

తనువంతా కొత్త చిగురులు తొడుగుకుని

కోయిల గానం కోసం ఎదురు చూసే వసంతంలా

నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను.

నీవు ఊహమాత్రంగానైనా నను చేరిన వెంటనే...

నా తలపులన్నీ జల్లులుగా మారి

ఆ ప్రేమ వర్షంలో మన ఛాయలు

తడిసి మన తపనల వేడిని చల్లబరుచుకుని,

పెనవేసుకున్న ఛాయలు ఒక్కటై

ప్రేమ పందిరి క్రిందకు పదిలంగా

చేరి ఆ గుర్తులన్నీ ప్రోది చేసి

అక్షర మాలగా గ్రంధస్తం చేసుకోవాలి.

ఆ అక్షరాలన్నీ వాడని ప్రేమ కుసుమాలుగా

విరియాలి. అవి మన ప్రేమ పరిమళాలను

వెదజల్లుతూ విశ్వమంతా మన ప్రేమను

వ్యాపింపచేయాలి.

ఆ విశ్వ వ్యాప్తమైన మన ప్రేమ పరిమళాలు

ప్రేమ ఛత్రంగా మారి ప్రేమను పంచే

అందరికీ ప్రేమమయ నీడను ఇవ్వాలి.

మన మనసులలో ఆనందపు వెల్లువలు విరియాలి.

తనువుల కలయికతో వచ్చే ప్రేమ కన్నా

మనసుల కలయికతో వచ్చే ప్రేమ శాశ్వతమని తెలియజేస్తూ, నిత్యనూతంగా , అఖండమై ప్రేమ జగత్తులో కాంతులు వెదజల్లాలి.

ఈ క్షణానికి నేను నీతో పంచుకోవాలనుకున్న నా భావనల నీడ నీకు గొడుగుగా మారి నిన్ను అనుక్షణం అనుసరించాలి.

అందుకే నా ప్రేమ గొడుగును నీకు భద్రంగా పంపిస్తున్నాను.

ఉంటాను మరి...

ఇట్లు....

నీ....🌹

✍️✍️ By Radha


Rate this content
Log in

Similar telugu poem from Drama