అమ్మ
అమ్మ


అమ్మా అని పిలవాలనుకున్నా
పిలిచినా పలుకదుగాకానీ,
కన్నా అని బదులిచ్చే
ఆస్వరం నాచెవుల్లో
గింగిరాలుగా తిరుగుతూ
హృదయాంతరాలలో
అమ్మ రూపం
చెదరని చిరునవ్వుతో...!
అమ్మచేతి
గోరుముద్దలు కావాలనుకున్నా
కొసరికొసరి వడ్డించే
ఆ ఆప్యాయతానురాగాల తడినే
అమ్మచేయిగా తడుముకున్నా...!
అమ్మ ఒడిలో
నిద్రపోవాలనుకున్నా
వొదిలెళ్లిపోయిన
చీరచెంగుని పరిచి
నిదురపోయాను కమ్మగా...!
అమ్మా అని పిలిచాను
నవ్వుతూ దృశ్యామానం ఆరూపం
కడుపు చల్లగా
కనులకు చల్లగా
కలలోకొచ్చిన అమ్మ
రూపం కరిగిపోదుగా కడదాక..!!