కిం కర్తవ్యం
కిం కర్తవ్యం


మనసు మసకబారుతున్నది
మెదడుమొద్దుబారుతున్నది
కనుచూపుమేరలో
మానవత్వపు ఆనవాళ్ళు కానరాక
మంచుపొర కప్పినట్లు
అన్యాయం అక్రమాల మాయ పొర కమ్మేసింది.
బంధుత్వాలు ధనదాహపు బరువుతో
తెగిపోయే దారాలయ్యాయి
కల్తీలు,కాలుష్యాలూ
శరీరపు అణువణువులో
నిక్షిప్తమయ్యాయి
కులం, మతం మనిషి గుర్తింపు చిహ్నాలయ్యాయి.
ఇవేవీ జీర్ణించుకోలేనినాకు
కిం కర్తవ్యం?