కన్నీటి సుధ
కన్నీటి సుధ


కనుపాపలో నిలయమైన సంద్రమా!
భావోద్వేగాల నడుమ కురిసే మేఘమా!
ఆనంద పారవశ్యానికి చిహ్నమా !
వేదనకి ప్రతి రూపమా !
ఎడబాటుకి దృశ్య రూపకమా!
నిరీక్షణ కి నిలువెత్తు సాక్ష్యమా!
క్రోధానికి ఉబికి వస్తున్న లావా ప్రవాహమా!
హాస్యానికి పొంగి పోర్లే క్షీరసాగరమా!
శోఖానికి ఆనకట్టే లేని నదీ ప్రవాహమా!
కారుణ్యానికి కరిగే మంచు పర్వతమా!
నవరసాల నడుమ నాట్యమాడి
చెక్కిళ్ళను ముద్దాడి
అధరాలకు రుచి చూపి
రుధిరానికి ఊరట ఇచ్చి
హృదయానికి శాంతిని ఇచ్చి
భూమాత ఒడిని చేరే
కన్నీటి సుధకు శతకోటి వందనాల చందనాలు