ప్రకృతి విలయం
ప్రకృతి విలయం
ప్రకృతి విలయం
జలప్రళయం
రోడ్లు ఇల్లు
జలమయం
ఇచ్చి చేయూత
చూపాలి మానవత
చాటాలి ఐక్యత
మన కనీస బాధ్యత
కష్ట కాలంలోనే
తోటివారికి
సహాయం చేయడం
మన ధర్మం
ప్రార్ధించే పెదవుల కన్నా
సాయం చేసే చేతులే మిన్న
నీకు చేతనైన సాయం
మించనీకు సమయం
తోటి వారి భద్రత
తీసుకో బాధ్యత
చేయి చేయి కలుపుదాం
చేతనైన సాయం అందిద్దాం
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
అని ఎలుగెత్తి చాటిచెపుదాం
మన వంతు బాధ్యతగా
తోటి వారికి సాయపడదాం
