STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

విహార యాత్రలు

విహార యాత్రలు

1 min
299

వారాంతం సెలవుల కోసం ఎదురుచూపులు

సిటీ నుండి కొండల్లోకి పరుగులు

పాటలు సరదాలు

ట్రెక్కింగ్ స్విమ్మింగ్ అనుభవాలు


మనలో మనమే చెప్పుకోవాలనుకునే కబుర్లు

మనసైన వాళ్ళ మధ్య ఏకాంతాలు

కెమెరాల్లో బంధితమవుతున్న అనుభూతులు

కొండ కోనల్లో సెలయేళ్ల చప్పుళ్ళు


కొత్త మనుషులు కొత్త పరిచయాలు

ప్రతి ప్రయాణంలో నేను కొన్ని భద్రంగా పదిలపరుస్తాను

ఆ కొత్త చోట్లలోని మనుషులు వారి నవ్వులు 

జ్ఞాపకాలన్నీ ఫోటోల్లోనే కాదు

పుస్తకాల్లో భద్రపరుస్తాను


ఎవరో చదువుతారని కాదు

మనసు బాగోలేనప్పుడు

ఆ పుస్తకాల పేజీలు తిప్పుతాను

వాటిలో విహార యాత్రలు చేస్తాను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract