STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

నిర్ణయం

నిర్ణయం

1 min
335

మర్చిపోవాల్సిందేనా మరపు వస్తుందంటావా

ఆ మత్తు ఆ హాయి

నువ్వు చెయ్యి పట్టుకుంటే

నా చెంప నిమురుతుంటే

నీ మునివేళ్ళ స్పర్శకు స్పందించే నా శరీరం

నువ్వు తప్ప ఇంకెవరూ వద్దనే మనసు


ఎంత అలవాటు పడిపోయాను

నీ నవ్వులో నా సంతోషం వెతుక్కోవడానికి

నీ అలవాట్లను నా అభిరుచులుగా మలచుకోవడానికి

నా భవిష్యత్తును నీ పాదాక్రాంతం చేయడానికి


ఇక ఇప్పుడు మిగిలింది ఒక స్తబ్దత

నువ్వు వెళ్ళేటప్పుడు ఇచ్చిన నిర్లిప్తత 

ఇవే ఉన్నాయి

ఇక చాలు

ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి

కాస్త నిద్రపోవాలి.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract