జాస్మిన్ లేని అలాడిన్
జాస్మిన్ లేని అలాడిన్
ఏదైనా సరే
ఎడారైనా సరస్సైనా
మాయా నగరమైనా మరో ప్రపంచమైనా
ఆకాశపు భవనమైనా
అందమైన నా జాస్మిన్ నా దగ్గర లేదే
అనే బాధ వీడడం లేదు
జీనీ
నువ్వు కాస్త జాస్మిన్ కోసం వెతుకు
నేను ఇటు వెతుకుతాను
జీనీ
ఏం మాట్లాడవు
జాస్మిన్ కూడా పేద అలాడిన్ ని కాదనుకుందా
ప్రేమంటే ఇంతేనా జీనీ
అలాడిన్ బాధ చూసిన జీనీ
ప్రేమంటే తనకు తెలియదని
స్నేహం అంటే మనదే అని ఓదార్చాడు
జాస్మిన్ లేని అలాడిన్ కి ధైర్యం చెప్పాడు.
