ఆకుపచ్చని స్వప్నం
ఆకుపచ్చని స్వప్నం


ఓ రోజు
పిచ్చుకలు నిద్రలేపాయి
ఎప్పటి నుంచో చూడాలనుకున్న పువ్వులు కనిపించాయి
తుమ్మెద ఝుంకారాలు వీనులవిందు చేశాయి
మార్గమాసపు స్నానం చేసినట్లు
సరస్సులు కళకళలాడాయి
తామర తూళ్లను తింటున్న హంసలు
ఎగిరి పడుతున్న చేపలు
నేను ఉన్నది భూమేనా
లేక స్వర్గలోకపు ఉద్యానవనమా అని తలంపు
నెమళ్లే వేణువులూదినట్లు పరవశాల పలకరింపు
ఈ ఆకుపచ్చని స్వప్నం
నిజమైతే ఎంత బావుణ్ణు
నిజంగా మనం చెట్లను కాపాడి
ధైర్యంగా ఊపిరి పీల్చుకొగలిగితే ఎంత బావుణ్ణు