STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

నేను కుచేలుడినే కానీ

నేను కుచేలుడినే కానీ

1 min
281

పరవశించాను నేను నీ సాహచర్యంలో 

అది నా అదృష్టమనుకున్నాను

భాషలు వేరైనా భావాలు అభిప్రాయాలు ఒకటని ఆనందించాను


స్నేహమంటే ఇదీ అని నలుగురూ పొగిడేలా

చూసినవాళ్ల కన్ను కుట్టేలా ఒకే మాట మీద మనం నిలబడ్డాం


కానీ 

కొద్ది రోజులకే ఏమైంది

ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైనా జరిగిందా

ఏమో తెలీదు

ఎవ్వరూ చెప్పలేదు

నువ్వేమో మాట్లాడవు


ఏమైంది అంటే సిలబస్ లో లేని ప్రశ్నను చూసిన విద్యార్థిలా చూస్తావు

నిజమే 

లోకం తీరు అంతే

స్నేహం శాశ్వతంగా ఉండడం కష్టమే

నన్ను తప్పుగా లోకం అనుకోవచ్చు

నేను ఈనాటికీ కుచేలుడినే 

కానీ నువ్వు కృష్ణుడివి కాలేదే?



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract