STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

బానిస సంకెళ్లు

బానిస సంకెళ్లు

1 min
540

నిందించే చూపులతో

నీరసించే మాటలతో

బద్ధకపు అలవాట్లతో

భయపడే అభిప్రాయాలతో


ఎన్నాళ్ళని సర్డుకుపోతావ్

వ్యసనాలకు లొంగి

నీలో ఉన్న మనిషిని దిగజార్చుకుపోతావ్

లే

సగం కాలిన ఆత్మ విశ్వాసం పూర్తిగా బూడిద కాకముందే

లేచి నిలబడు


నువ్వు చెయ్యలేవు నీ వల్ల కాదు

అనే మాటల తూటాలకు ఎదురెళ్లి

గుండె నిబ్బరంతో పోరాడు

తెంపుకో దౌర్బల్యమనే బానిస సంకెళ్లు


మిత్రమా!

నీ చెమట చుక్క వేగు చుక్కై 

దాటిస్తుంది కష్టాల సాగరం

రా ఆవలి వైపున నేనున్నా

నీ స్వేచ్ఛను నీకై ఎదురు చూస్తున్నా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract