STORYMIRROR

Ragolu Venkata Ramana

Drama Fantasy Inspirational

4  

Ragolu Venkata Ramana

Drama Fantasy Inspirational

అమ్మ

అమ్మ

1 min
353

ఉదయించే భానుకిరణాలంత వెచ్చనిది నీ ప్రేమ 

పున్నమిరేయి వెన్నెలంత చల్లనిది నీ చూపు 

పచ్చిపాల నురగంత స్వచ్ఛమైనది నీ మనసు 

మకరందాల మధువంత మధురమైనది నీ మాట 


కటిక దరిద్రమందు కూడా నీ వారికోసం పడే తపన 

కరుడుకట్టిన ఉన్మాదిని సైతం క్షమించే నీ జాలి 

కష్టాల పద్మవ్యూహ్యాన్ని సైతం ఎదిరించే నీ తెగువ 

ఎన్ని అద్భుతాలు దాచుకున్నావో కదా..!!!


ఎర్రని సూరీడు సైతం తలవంచడా నీ కరుణ ముందు 

జాబిలమ్మ సైతం ఈర్ష్య పడదా నీ అమ్మతనం ముందు 

భూమాత సైతం చిన్నబోదా నీ సహనం ముందు 


ఎంతని చెప్పను ఏమని చెప్పను 

పంచభూతాలు సైతం తన్మయంతో నాట్యమాడవా నీ పేరు వినగా... 

ఇక ఏమని వర్ణించను నీ గొప్పతనాన్ని....


-- వెంకటరమణ రాగోలు 



Rate this content
Log in

Similar telugu poem from Drama