STORYMIRROR

Ragolu Venkata Ramana

Drama Tragedy Fantasy

5.0  

Ragolu Venkata Ramana

Drama Tragedy Fantasy

అమ్మ అస్తమించింది

అమ్మ అస్తమించింది

1 min
499

నడిరాతిరి సైతం దారి చూపే తేజోభరితమైన నీ చిరునవ్వు 

కష్టాల కడలిని సైతం సునాయాసంగా దాటే నీ నేర్పు 

బాంధవ్యాల బాధలను సైతం చిరునవ్వుతో భరించే నీ ఓర్పు 

ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా బిగి వదలని నీ కూర్పు 

ఎటువంటి గడ్డు స్థితి లో ఉన్నా నువ్వు మా మీద చూపే ప్రేమాభిమాన ఆప్యాయతల మైమరుపు 


ఇవి చాలవా అమ్మ నిన్ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించడానికి... 


కానీ... ఆగిపోని కాలం నిన్ను ఆగిపోమన్నాదో ఏమో... 


ఐనవాళ్ల కోసం జీవితాంతం ప్రాకులాడిన నీ కట్టె... చీకటయ్యేసరికి ఆరడుగుల పడకపై పడింది 


బాంధవ్యాల సంకెళ్లు తెంచుకున్న నీ మేను... వెచ్చని కట్టెల దుప్పటి కప్పుకుంది 


ఇప్పుడు నిన్ను కదిలించే వారెవ్వరు??? 

నీతో మాట్లాడేవారెవ్వరు??? 


ఉన్నట్టుండి పున్నమి రాత్రి అమావాస్యయింది 

వెలుగారని మా కన్నుల్లో చీకటి రాజ్యమేలుతుంది 

నన్ను మోసిన పేగు బంధం అగ్గిలో బుగ్గయింది 


మొదట రుచిగా నీ చనుబాలే నాకు పట్టావ్ 

మొదట మాటగా నీ మాటే నా నోట చెప్పించావ్ 

మొదట అడుగుగా నీ అడుగునే నా అడుగులా వేసావ్ 

అలాగే ఇప్పుడు మొదటి సారిగా ఏడవడం కూడా నేర్పిస్తున్నావ్... 


నీ జ్ఞాపకాలు రేపుతున్న కలవరపాటుని తట్టుకోలేని నా గుండె మౌనంగా కన్నీరు కారుస్తుంది 


కన్నీటిలో తడిసి ముద్దయిన నా కనులు నిదుర కరువై వెలవెలబోతున్నాయి 


బండరాళ్ళకు ఎట్టాను పట్టదు ఇక ఈ గుండె మంట ఆరేదెట్టానో... 


- వెంకటరమణ రాగోలు 


Rate this content
Log in

Similar telugu poem from Drama