STORYMIRROR

Ragolu Venkata Ramana

Drama Tragedy Inspirational

4  

Ragolu Venkata Ramana

Drama Tragedy Inspirational

ప్రకృతి ఎంత గమ్మతైనది...

ప్రకృతి ఎంత గమ్మతైనది...

1 min
354

మనుష్యులు, తమ అల్ప సంతోషాల కోసం,  సమస్త జీవకోటి మనుగడకే ప్రాణాధారమైన ప్రకృతిని చెరపబోతే... చూస్తూ ఊరుకుంటదా... తనదైనశైలిలో బుద్ధి చెప్పదూ...


సుగంధ పరిమళాలను ఆస్వాదించే ముక్కుతోనే... ప్రాణవాయువు కోసం ప్రాకులాడేలా చేస్తుంది...  


కోయిల కిలకిలలు జలపాతాల రాగాలు వినే చెవులతోనే... అన్నార్తుల హహాకారాలు మరణ మృదంగాలు వినేలా చేస్తుంది... 


రమణీయ ప్రకృతి సోయగాలు చూసే కళ్ళతోనే... దిక్కులేని చావులు, శవాల గుట్టలు చూపిస్తోంది... 


మధుర స్వరాలూ చిలక పలుకులు పలికిన నోటితోనే... మరో సూర్యోదయం చూసేలా కరుణించు భగవంతుడా అనేలా చెప్పిస్తోంది...


అయ్యో..!!! మానవజాతి ఎంతటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోంది....


కోయిల రాగాలు పలికే నోటికి మాస్క్ తో ముడిపడింది  

షడ్రుచులు తినే నాలుకకి మందులే ఆహారమయింది 

నిండు నూరేళ్లు భూమాత మమకారం పొందాల్సిన చోట అర్ధాయుష్యే లోకరూఢియమైనది కదా... 


స్వీయ తప్పిదముతో ఏర్పడిన కరోనా విలయం నుండి తనను తాను రక్షించుకునేందుకు ఎంతలా విలవిలలాడుతుంది ఈ మానవ సమాజం... 


- వెంకటరమణ రాగోలు


Rate this content
Log in

Similar telugu poem from Drama