కవితా పూరణం
కవితా పూరణం


కవితా పూరణం - 25.02.2020
దత్త పాదం : " లలితంబై వినసొంపునై నవరసాల(జిల్కు ఈ పేటివే "
పూరణం :
చలిత కవన స్వీకృత రచయితలమదిని భావంబులే
నెలత లవర్ణనల ఇక్షు రసంబులన్ రసాస్వాదంబులే
వలపించే స్వాదు భరితంబగు గానామ్ర పానకంబులే
లలితంబై వినసోంప్పునై నవరసాల(జిల్కు ఈపేటివే ||
ప్రతిపదార్థము :
చలిత = కదలిక కలది ; కవన = కవితా రంగము : స్వీకృత = స్వయంగా రచించిన రచనలే = కవితా- వ్యాసాంగాలు : రచయితల=కవుల : మదిన్ = మదిలో : భావంబులే = లిఖిత ఆలోచనలే : నెలతల = లలనా మణుల / ప్రకృతి సంబంధిత వర్ణనల = వివరణలు- అలంకృత పద సమూహాలు : ఇక్షు రసాలు = చెఱుకు రసాలను : బోలిన = పోలిన : రసాస్వాదనంబులే = రుచికరమైన పానీయంబులే వలపించే = అందులో చిక్కుకొనినటువంటి : స్వాదుభరితంబులై = మధుర , రుచికరమైన దృశ్య శ్రవణ వీచికలైనట్టి : గాన = పాడిన/ పాడబడెడి : ఆమ్రపానకంబులే = మామిడి పండ్ల రసాలే (పానకాలే ): లలితంబై= సౌమ్య తత్వమై : వినసొంపైన = వీనులవిందుగా : నవరసాలన్ = తొమ్మిది విధాలైన రసవంతములైన రచనలను : చిల్కు : మధించునట్టి : ఈ = ఈ విధమైన పేటివే = పేటికవే .
భావం : చలనము కల్గిన కవితా రంగమున స్వయముగా రచించిన రచయితల - రచనా వ్యాసాంగాలు , వారి మదిలోని ఆలోచనలే లలనామణుల / ప్రకృతి రమణీయ వర్ణనల అలంకృత పద సమూహాలే చెఱుకు రసాలను పోలిన రుచికరములైన పానీయములే వలపించే అందులో చిక్కుకున్నట్టి మధుర రుచికరమైన , దృశ్య-శ్రవణ వీచికలైనట్టి పాడ బడెడి మామిడి పండ్ల రసాలే - పాన కాలే సౌమ్య తత్వమై , వీనుల విందుగా , తొమ్మిది విధాలైన రసాస్వాదనలచే నిండ బడిన రచనలే ఈ విధములైన పేటికయందున్నవని ఈ పాదము యొక్క భావం .
************