కవితా పూరణం : దత్తపదిః- ఊ - ప - నీ - ఆ 🌷కవీశ్వర్ : 18.03.2022
కవితా పూరణం : దత్తపదిః- ఊ - ప - నీ - ఆ 🌷కవీశ్వర్ : 18.03.2022
కవితా పూరణం : కవీశ్వర్ : 18 . 03 . 2022
దత్తపదిః- ఊ - ప - నీ - ఆ 🌷
న్యస్తాక్షరిః- పద్య పాదాదిన రావాలి 🌺
పూరణం 💐:
ఊదా వర్ణ పరాగం చిలకరింపగా తనువు పై నంతగా గొప్పనై వర్దిల్లె,
పసుపు రంగు కుసుమపరాగము వలేనన్దమరే కనువిందు సేయగా ,
నీల వర్ణంబున్ బులిమెడు శ్వేత వస్త్రము పై సంతసం తో చల్లగా ,
ఆకుపచ్చని , ఇతర వర్ణములచే జరుపుకుందమీరంగుల పండుగను .||🌸
🌸🌸
భావం : మన వసంతోత్సవ హోలీ రంగులపండుగను జరుపుకున్నప్పుడు
ఏవిధమైన అనుభూతి కి లోనవుతున్నామో ఈ కవితా పూరణం లో ఆహ్లాదంగా
ఊదా రంగు ను పరాగము పొడి లాగా చిలకరిస్తే మన శరీరం పైన పడి గొప్పగా
వర్ధిల్లింది.అలాగే పసుపు వర్ణంమనకు కుసుమ పరాగం వలే కనువిందు చేయసాగింది
అలాగే ధరించిన తెల్లని వస్త్రములపై నీలం రంగును పులిమి,సంతోషంతో చల్లగా
ఆకుపచ్చని రంగు లతో పాటు ఇతర రంగులచే మనం ఈ రంగులపండుగ యైన హోలీని
ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాము . అని ఈ దత్త పాదం యొక్క భావం .🌷🌷🌷
🌷🌷
వ్యాఖ్య : " ఈ శుభసందర్భలో పాఠకులందరికి, సమీక్షకులందరికి వసంతోత్సవ(హోళీ) పండుగ శుభాకాంక్షలు"
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
