STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కరుణయే సౌందర్యం

కరుణయే సౌందర్యం

1 min
335

మరిగే ద్వేష రక్త కాసారాలు

మరుగున పడి విధికి చిక్కిన చిన్ని ప్రాణాలు

వీధి బాలలుగా మారిన వారు

అతను గురువై అక్షరాలు దిద్దించాడు


చెప్పలేని బాధలు కన్నీటి పరదాల మాటున దాచి

సమాజం నుండి బహిష్కృతమైన అభాగినులకు

ఒక ఆసరా కల్పించి వారికి వెలుగు బాట చూపించాడు


దివ్యాంగుల జీవితాన్ని మెరుగు పరిచేందుకు

కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని

సమాజంలోని యువతను ప్రేరేపించాడు


స్వచ్ఛంద సంస్థల సహాయంతో

ప్రకృతి వైపరీత్యాల బాధితులకు

ఒక నీడను ఏర్పరిచేందుకు తపన పడ్డాడు


నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక మంచి మాటగా

వేదనలో ఉన్న వారికి సాయమందించే చల్లని చేయిగా

అతను ముందుకు నడిచాడు

అతని కరుణయే సౌందర్యం కదా


ఆ కరుణ నీలోనూ ఉంది

కాస్త చుట్టూ చూడు

ఆ అలజడి సద్దుమణిగి

నీలోని నిన్ను కలుసుకో


Rate this content
Log in

Similar telugu poem from Abstract