కొరేగాం యుద్ధం
కొరేగాం యుద్ధం
చరిత్ర లేదని, చరిత్ర తెలియదని
చరిత్రను నిర్మించలేదన్న చరిత్రను విను
వక్రీకరించబడ్డ చరిత్ర పుటలను తిప్పిచూడు
నీ పొరలు కప్పుకున్న కళ్ళను తెరిచి చూడు
నా చరిత్రంటే జనన మరణ తారికులు గాదు
నీ రాజుల రాణులు,అంతఃపుర కాంతల
ప్రేమ పురాణాలు, విరహ గీతాలు గాదు
విలసాలు, విలపాలు అసలే కాదు
ప్లాసి యుద్ధం నుండి భీమా కోరేగాం యుద్ధం వరకు
కంపెనీ సైన్యం నుండి నేటి కార్గిల్ యుద్ధం వరకు
ఓల్గా నుండి గంగా, సింధు సరిహద్దుల వరకు
చీకటి కోణం నుండి నిష్పాక్షిక దృష్టితో
దాచేస్తే దాగని సత్యాలను చూడు
నా రక్తం పారని మట్టిని చూపు
నా తల తెగని గుడిని చూపు
నా దేహం ముక్కలుగా పడని మూలను చూపు
మనువాద బ్రహ్మనిజ-బుద్ధిజంలా మహా సంగ్రామమె అసలయిన భారదేశ చరిత్ర అని తెలుసుకో
శౌర్యానికి, శౌర్యా పతకాలు
విరత్వానికి సువర్ణ బంగారు హారాలు
ప్రలోభాలకు లొంగని యోధులకు సన్మానాలు
ధైర్య సాహసాలకు, వీరుల శక్తి యుక్తులకు
విశ్వాసాలకు, విధేయతలకు,విశాల హృదయాలకు
నా బహుజనులు, దేశ భక్తికి పర్యాయ పదాలు
పీష్వా పాలనకు చరమ గీతం పాడి
భీమా నది ఒడ్డున నిలుచున్న అరవై ఐదు
అడుగుల ఎత్తున్న మహాస్థంభాన్ని చూడు
ముప్పయి రెండు చదరపు అడుగులు
వెడల్పుగా ఉన్న మహార్ల విరత్వం కను
ఆ విజయ స్థంభం, మా సమర సింహం
ఆ అజరామరమైన స్మృతి చిహ్నం
నీ వెన్నులో వణుకును పుట్టిస్తది
ఎందుకంటే అది నా ఆత్మ గౌరవ పోరాట స్థూపం
నీ ఆత్మ గౌరవాన్ని భీమా నదిలో కలిపిన
కొరేగాం యుద్ధం
