కమ్ముతున్న చీకటి
కమ్ముతున్న చీకటి
కొమ్మల్లో కూర్చున్న కోయల పాటలో మాథుర్యం కరువైంది.
నీకై వేచిన నా కన్నులు మసకబారినాయి.
ఈడు ఇక నీనుండి దూరం తీసుకు వెళుతుంది.
నీ కన్న నలుసు ఇక ఒంటరై నీకై ఎదురు చూస్తున్నాడు.
తన చుట్టు కమ్ముకుంటుంన్న చీకటిని చూసి భయపడుతున్నాడు, ఇకనైనా నిను తీసుకు వెళ్లిన వాడి దగ్గర శెలవు దొరకదా.
పోనీలె నీకై అలిసాను, ముందు నే వస్తున్నా, వెనుక వాడు వస్తాడు.
నీ నవ్వులోని ఆదరణ ఈ జీవితంలో దొరకలేదు
