గులాం
గులాం
దుాదిపింజలకు ఏమి తెలుసురా స్తిరమైన వరి థాన్యం విలువ!.
విదేశీ మద పిచ్చిగాడికేం తెలుసురా నా దేశం తల్లి మనసు!.
వొంటిమీద బట్ట వేయనోడికేం తెలుసురా నా దేశం నిండుతనం?.
ఆత్మ గౌరవమంటె లెక్కలేని వాడికెందుకురా నీ గులాంగిరి.
అతిధి దేవో భవంటు గౌరవమిచ్చే నావారి ఆత్మాభిమానం విలువ వారి తాగే చాటు గంజి,
ఎవడి వలన?.
వాడి వలన,
బలవంతపు తల వంచుడు,
మన నేతల అత్యాసలే, నావారి అడిఆశలు.
వాడు వచ్చి నన్ను కొల్లగట్టి, నా వారిని పొట్టబెట్టుకుని, ఇక నను స్వారీ చేయడం :-
నేను నవ్వకుాడదు, ఏడవకుాడదు,
నీ పెంపుడు కొడులె నేటి నేతలు, వాళ్ళ కేరింతలలో నా ఏడుపు నీకు వినబడదేమొనమ్మ,
ఈ ప్రాణం నీ వలన, నీ కోసం.
