Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

పిచ్చుకమ్మ

పిచ్చుకమ్మ

1 min
213


పిచ్చుక. ఒకప్పుడు ఎప్పుడో ఉండేది.

చిన్నిది, బుజ్జిది.

మాయమైంది. కాని ఈ మథ్యే ఒక్క దానిని చుాసాను.

పొరబాటున , చాటున పెద్దదైన్నట్టు ఉంది.

ఈంత పెద్ద , చెడ్డ విసాలమైన సిమెంటు ప్రపంచంలో ఒక్కతే, గుండె అలిసేటట్టు ఎగురుతుా తనవారిని , లేని వారిని వెదుకుతుా ఎగర లేక తన చిన్ని రెక్కలతో ఎగురుతుా మనకి కనబడని ఆ చిన్న నల్లటి కళ్ళ నుంచి కారే కన్నీరు.

కాకులు తిరిగే లోకం.

గ్రద్దలు మయం ఈ లోకం.

రెండు కాళ్ళ గ్రద్దలు.

పిచ్చుకమ్మ నీవి కొన్ని రోజులేనమ్మ.

తరువాత నీవుా కథలలో ఒక కథవౌతావు.

తెరమరుగౌతావు.

యాభైవ అంతస్తు మీద నిలబడి , ఎండిన కళ్ళతో మాడే కడుపుతో ఆశ వదలుకున్నావా పిచ్చుకమ్మ.

జాగ్రత్త మ్మా. పడతావు.

నా వంక నిరాశ నవ్వు: నీ వంక నా నిరాశ నవ్వు.

ఈ సారి నీ పయనం ఆకాశం వైపు కాదు.

రా నా చిన్నారి పిచ్చుకమ్మ: యాభైవ అంతస్తు మనది కాదు.

ఎంతో దుారంగ ఉన్న ఆ భుామే మన గమ్యం.

ఏడవకు:నేనుా ఏడవను.

దేవుడు వదిలిన ప్రాణాలం.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy