పాతదైంది నిజాయతి
పాతదైంది నిజాయతి
నీతి, నిజాయితీ అనుకుంటు ఒక జీవితకాలం గడిపేసావు, నీ ఖ్రతుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన అయింది.
ఎదుగులేని, ఎదగలేక మిగిలిన జీవితం.
ఈ కాలంలో నీతి, నిజాయతేంట్రా బాబు, నీవు అవుట్ డేటెడ్ వి రా నాయన.
నీ తల్లిదండ్రుల నీకు కరెక్ట్ బ్రతుకు, అదే, చీటింగ్ నేర్పలేదనుకుంటా.
డబ్బు లేక లోకం చేత తక్కువ చేయబడి, వయసు మీద పడి వెళుతున్న నీ ముఖంలో వీరికి తెలియని అలౌకిక ఆనందం నీ ముఖంలో,
ఎవరికి,ని చీట్ చేయని నీ గుణం నాకు గుణ పాఠం.
నాకు నీలో రమణ మహర్షి , జీజస్ కనబడుతున్నారురా బాబు.
వాళ్ళతో కూడా ఇలానే నేను బిహేవ్ చేసాను.
ఖర్మ రా బాబు, మంచోళ్ళు వెళ్ళిన తర్వాత వారి విలువ తెలుస్తుందంటారు.
పిచ్చని నిన్ను ఓ జీవితం ఆడుకున్నాం, మరు జన్మ లేని నీవు చెప్పాలని చూసి, మేము నేర్చుకోకపోతె, చిన్నగా తల ఊపుతు, చిరునవ్వు నవ్వుతూ , విడిచి దైవ పాదాలలో స్థిర నివాసమేర్పరచుకున్నావు.
(జ)డబ్బు) పిచ్చి పాకులాట బాబు, రసం పోయిన చెరకు పిప్పిగాడిని, క్షమించు.
