STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

కాలం విలువ

కాలం విలువ

1 min
213

అబ్బ కాలానికెందుకో అంత తొందర

ఇట్టే తరిగి కరిగిపోతుంది

క్షణం కూడా ఆగక

సెకను కూడా నిలవక

నిమిషం కూడా నిలకడ లేక

పరుగులు పెడుతూనే వుంది

ఎప్పటికప్పుడు విలువను చాటుతూ

గడిచిపోతే తిరిగి రానని

చెప్పకనే చెబుతోంది

చెంతనుండగానే సద్వినియోగం చేయమని

చేజారిపోతే తనది కాదు బాధ్యతని

నిర్లక్ష్యము తగదని హితబోధ చేస్తుంది

అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఆపడం ఎంత మూర్ఖత్వమో

ఎగసే కెరటాన్ని నిలపడం ఎంత అసాధ్యమో

కాలాన్ని ఆపగలగడం కూడా అంతే మరి

వున్న క్షణమే నీది, ఆస్వాదించు

మరు క్షణం వుందో లేదో

సమయాన్ని ఒడిసి పట్టు

అనుకున్నది ఇప్పుడే సాధించు

నీ కలలను సాకారం గావించు


Rate this content
Log in

Similar telugu poem from Fantasy