STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కాలి పగుళ్లు

కాలి పగుళ్లు

1 min
10

బూజు దులిపే కర్రలు

మసి గుడ్డలు

కూర మాడిన వాసనలు

ఎన్నో అలాంటివి

ఇవన్నీ చిన్న విషయాలే

కానీ ఇవి వినడానికి ఆమె దగ్గర మనిషే లేరు

ప్రేమగా పెంచుకున్న కోడిని

ఇష్టంగా కూర చేసుకు తినే లోకంలో

ఒక్క మనిషి కూడా తన మాట వినేందుకు లేరే


సూర్యుడిని పిలిచింది

నేనెప్పుడూ తిరుగుతూ ఉండాలి కాబట్టి రానన్నాడు

చంద్రుడిని పిలిచింది

కావాలంటే వెన్నెలను కురిపిస్తాను

దగ్గరికి రాలేను అన్నాడు


కాలి పగుళ్లు తడిమితే

మృత చర్మం కొంత రాలి పడింది

ఆ మృత కణాలతో ఆమె మాట్లాడింది

ఏదీ శాశ్వతం కానప్పుడు

జ్ఞాపకాలెందుకు

వాటిని పంచుకోవాలనే ఆతృత దేనికి

జ్ఞాపకాలు కూడా ఏరోజుకారోజు రాలిపోవచ్చు కదా

తోడు లేదనే విషయం గుర్తు చేయకుండా

మెదడు దానంతకతే పని చేయవచ్చు కదా అంది


శాశ్వతం కాదని తెలిసినా

మనిషి భావావేశాలను దాచలేడు కదా

అలా చేస్తే

ఇంత జనాభా ఎందుకుంటుంది

ఉండదు

అని ఆ మృత కణాలను చివరిసారిగా తాకింది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract