కాగే సమాజం
కాగే సమాజం
ఏ దేశమేగినా
ఎందు కాలిడినా
ఆడపిల్లల ఆర్తనాదాలే
ఏ దిక్కు చూసినా
ఎందాక సాగినా
మాతృమూర్తుల రోదనలే
ఏ ఇంట వెతికినా
ఎంత శోధించినా
కలుషిత బంధాలే
ఆధునికత ముసుగు
కప్పుకున్న సమాజం
సలసల కాగుతుంది
పంచభూతాలు సైతం భీతిల్లిపోయే
మనిషి విపరీత వైపరీత్యాలకు
ధరిత్రి భగభగ మండుతుంది
సమాజం రగులుతున్న
రావణకాష్టలా మారుతోంది
మానవీయత మరచిన మనిషిని చూసి
కాగే సమాజం ఎప్పటికి చల్లారుతుందో
అంతుచిక్కని భేతాళ ప్రశ్నే
