జీవన గమనం
జీవన గమనం
అడుగు వెంట అడుగు
తరిగే తీరేనంట దూరం
తూరుపు వైపు పయనం
అదే జీవితగమనం
విధిరాతకు తలవంచినా
ఎదురీత తప్పదు
ఊహించని చిత్రాలు జరిగే
జీవితం ఒక పెద్ద విచిత్రం.
గుండెలోని పెనుమంటలకు
ఓదార్పు నీ ఆలోచనలే!
వెలగాలన్నా తొలగాలన్నా
నిర్ణయం నీది మాత్రమే!
జీవిత రహదారిలో
పూలూ ముళ్ళూ సమానమే
కష్టాల కౌగిలి తప్పనిసరైతే
ఇష్టం పెంచుకోక తప్పదు.
మమకారాల వెనక ఉన్న
అహంకారపు తిరస్కారాలు
మెత్తని మాటల కత్తులు
చేసే కొత్త గాయాలు తప్పవు
చదరంగపు జగతిలో
నెర్పుగా పావులు కదిపి
ఓర్పుగా ఆట ఆడితే
గెలుపు వాకిట మనమే!
వెలుగు తరువాత చీకటి
వేదన వెనుక వేడుక
కాలచక్ర భ్రమణంలో
ఏదీ నిలువదు తోడుగా..
రేపన్నది విప్పని మూట
మనకోసమే దాన్ని మోసుకొచ్చే
మధురమైన ఉదయానికి...
.. సిరి ✍️❤️
