STORYMIRROR

Jyothi Muvvala

Classics Inspirational Others

4  

Jyothi Muvvala

Classics Inspirational Others

అమ్మ ఒడి

అమ్మ ఒడి

1 min
786


అమ్మ ఒడి ...

ప్రాణం పోసే గుడి

మమకారపు మది

అంతరాత్మకు నిలువెత్తు సాక్ష్యం అది

అది ఎన్నటికీ తరగని నిధి!

కళ్ళల్లో పెట్టుకుని పెంచిన అమ్మకి

గోరు ముద్దులు పెట్టిన తల్లికి

బదులుగా ఏమివ్వాలి?

ఆ లాలనకు రుణం ఎలా తీర్చాలి ?

చదువు, పెళ్లి అంటూ

దూరమైపోయిన

రోజు పలబడుతూనే ఉంటాం

అమ్మ తలపుల్లో...

నాన్న గుండెల్లో...

ఆశగా ఎదురుచూసే అమ్మతో

నాలుగు రోజులు గడపలేని పని

అనుబంధాలను కూడా లెక్క వేస్తేనే

కడుపు నింపుకునే దుస్థితి !

నిరాశతో సాగనంపుతూ...

వీడలేక విలపిస్తుంది!

ఏదో చేయాలని అనుకోవడమే తప్ప

ఏమీ చేయలేని అసమర్థులం

దేవతకు నైవేద్యం పెట్టిన

ప్రసాదమై తిరిగొస్తుందని

తెలియని అమాయకులం!

బిడ్డ క్షేమమే కోరే తల్లి మనసు

బిడ్డల కోసమే పరితపించి

చివరికి అన్ని ఇచ్చి తను మాత్రం

ఎన్నటికీ దొరకని ప్రేమను

తీసుకొని వెళ్ళిపోతుంది...!!

--జ్యోతి మువ్వల

బెంగళూరు 


Rate this content
Log in

Similar telugu poem from Classics