STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

మానవ జన్మ

మానవ జన్మ

1 min
336

కుట్టీ కుట్టంగానే చనిపోయే చీమను చూస్తే ....!విధితమైంది మనిషి ఆయుష్యు ఎంత పెద్దదో అని

బురదలో పొర్లుతూ ఉండే వరాహాన్ని చూస్తే ...!అవగతమైంది మానవ జన్మ ఎంత ఉత్తమమైనదో అని

కసాయి వేటుకి బలి అయ్యే గొర్రె ను చూస్తే ....!తేటతెల్లమైంది మనిషి పుట్టుక ఎంత విలువైనదో అని

విగత కోడి పకోడి చూస్తే..

రుజువయ్యింది మనిషిగా పుట్టడము ఒక వరమని

మనసున ఉన్నది చెప్పుకోలేని మూగజీవాలను చూస్తే ...!

దృవీకరించబడింది మనిషి ఎంత అదృష్టవంతుడో అని

అన్ని జన్మలలో కెల్లా ఉత్తమోత్తమమైన మానవుడు....!

మరణంలో కూడా అవయువ దానము తో పునర్జన్మనిస్తూ ...ధన్యులవుతుంటే

ఇటువంటి గొప్ప వరాన్నిపొంది కూడ

కొందరు బలవన్మరణమునకురుకుతుంటే...!

శాపము గా మార్చుకుంటుoటే....ఏమనాలి

విచక్షణ కోల్పోతున్న వారినేమనాలి...!

ఓ మనిషీ తెలుసుకో నీ జన్మ మహోన్నతము...!

విలక్షణమైన సుదీర్ఘ పయానము ...!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational