నీ ప్రేమ విలువ ...
నీ ప్రేమ విలువ ...
నీ ప్రేమ విలువ ...
కొన్నిసార్లు మండేసూర్యునిలా నీ కోపపు వేడి తాపాన్ని నాపై విసురుగా విసిరేసి పోతావు.
నేను అలకపూనితే చిన్ని కన్నయ్యలా.
నా గుండెగూటిలో చెక్కిలిగింతల నీ మాటలు ఒదిలివెళ్తావు.
మనసంతా దిగులుతో నిండినప్పుడు
వెన్నెల అరబోసిన నవ్వుతో నన్ను పలకరిస్తావు.
నీ తోడు లేని జీవితం అంధకారం అనిపించినప్పుడు
నీ ఊహల్లో సప్తవర్ణాల హరివిల్లును చూపిస్తావు.
అర్ధం లేని ఆలోచనలతో నా మనసు చెదిరినప్పుడు
జీవిత సారం బోదించే గురువువై నన్ను బతుకుబాటలో ముందుకు నడిపిస్తావు..
చికాకుల మధ్యలో ఉక్కపొసి నలిగిపోతున్నప్పుడు..
చల్లని సమీరానివయి నన్ను అల్లుకుపోతావు..
ఆనందసమయంలో మనసు విహంగం అయితే ప్రణయపాఠాలు చెప్తూ.. తనువుని మైమరిపిస్తావు..
నీ ప్రేమ విలువ... నా జీవితం ప్రియా..
శ్రీ...
హృదయ స్పందన.
