ఎదురు చూపులు
ఎదురు చూపులు
నీకోసం, నాగుండెను గుడిగా మలిచా,
నీ ధ్యాసలో పడి నను నేనే మరిచా.
నీ ఊహల్లో తేలి, చేరా సుదూర తీరాలకు,
అంతూ దరీ, లేకపోయే ఆ ఊహాలోకాలకు.
తల్చుకుంటున్నా, నిన్ను నేనెంతగానో,
నీ స్మృతి పథాన మరి ఉన్నానో, లేనో,
ప్రేమ మైకం, నన్నెంతగా కమ్మివేసెనో,
నీ తలపులతో, నే నిదుర దరికి చేరనో.
కన్నీటి తో వెలిగించా నా కంటి దీపాలను,
నీరాకకై మనసు వాకిలి తెరిచి వేచియున్నాను,
నీ జాడలేక దహించుచున్న నా హృదయమును,
ఏ తీరున శమింపచేసి సముదాయింపగలను!
అలసిసొలసినవి ఎదురు చూచిన బాటలు,
వేసారి వాడినవి నీకై నే కూర్చిన మాలలు,
నా స్వామీ! అరమోడ్పులైనవి నా కనులు,
ఎన్నాళ్ళు నాథా! నాకీ ఎదురుతెన్నులు!