పరుల పీడనం
పరుల పీడనం


పద్యం:
పరుల పీడనంబు బహుళ సుఖము యేల
పరుల మంచి కోరు పరిమళముగ
పంచు మంచి బుద్ధి పగ వీడి కసి వీడి
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!
భావం:
తల్లీ భారతీ! ఇతరులను బాధపెట్టి మనము సంతోషపడితే దానికి అర్థం ఏముంటుంది? ఇతరులపై పగను, ద్వేషాన్ని వీడి వారి తో మనస్ఫూర్తి గా మాట్లాడి, వారి మంచి కోరినప్పుడు కదా మనకు సంతోషం కలిగేది!