శ్రావణ శివుడు
శ్రావణ శివుడు


అదిగో శ్రావణ మేఘం
నన్ను నీ మందిరము వైపు నడిపింది
చిరు జల్లులను దోసిలి పట్టి
మనసారా నీకు అభిషేకం చేయమంటోంది
అహంకారపు చీకట్లు ముసిరిన మనసును మార్చుకొన
నీ ముందు చిరు దీపము వెలిగించమంటోంది
నందీశ్వరుని చిరు గంటలను కదపమంటోంది
మనస్సుని బిల్వముగా మార్చి నీకు అర్పించమంటోంది
కాముని భస్మం చేసిన దేవరకు భస్మము అలంకారము చేయమంటోంది
శివ భక్తుల పాద ధూళి నొసట ధరించి నన్ను పవిత్రము కమ్మంటోంది
మోహపు మాయలు వదిలి నీ ముందు సాగిలపడి మ్రొక్కమంటోంది
శివా!
పార్వతీ హృదయ వల్లభా!
ఈ శ్రావణ మేఘం
నాలో ఉన్న నిన్ను కలుసుకోమంటోంది
నీవే నేనని
నేనే నేనని
సర్వమూ శివోహం అని అనమంటోంది