STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

మానవత్వం

మానవత్వం

1 min
426

నిలిచి వుందా మంచితనం

ఏం కలికాలమో ఇది

చిత్రమైన రోగాలు

విచిత్రమైన వైరస్ లు

మనిషికి మనిషికి మధ్య

దానవత్వపు దడి కట్టి

దయార్ద్ర హృదయాల్లో

స్వార్థపు వేళ్ళు

వటవృక్షంలా పెరిగి

కనీస విలువలు సైతం

మృగ్యమై మృగమై

విశృంఖల విపరీతాలతో

వికృతంగా మారుతూ

ఓ అదృశ్య శత్రువు తో

నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నాడు

నీ గుండె కుహరం లో

మత్తుగా నిద్రిస్తున్న

మంచిని తట్టి లేపు

మానవత్వం నిలిచే వుందని

గోరంత నీ పలకరింపుతో

కొండంత మనోధైర్యం నింపి

మానవత్వం చాటుకో


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy