STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

పెళ్ళి

పెళ్ళి

1 min
394

జీవితములో ఒకే ఒక సారి వచ్చే..

మధురమైన అపురూపమైన ఘట్టం పెళ్లి ..

అలనాటి అయిదు రోజుల పెళ్లి వేడుకలోని మాధుర్యం..

నేటి చేవ్రాలు పెళ్ళిలో మచ్చుకయిన లేదే!

పసుపు లేపనాల శుభసూచకాలు..

నిండు ముత్తైదువుల కోలాహలాలు

నలుగు పిండి మంగళ స్నానాలు ..

ఆడపడుచుల పెత్తనాల సందడులు..

పండితుల వేద మంత్రాలు

మంగళ వాయిధ్యాలు..సన్నాయి మేళాలు..

అలకసంబరారాల దోబూచులాటలు...

నిండైన బంతి భోజనాలు..

చూడ ముచ్చటైన వధూవరుల ఓర చూపులు..

ఉంగరాల వెతుకులాటలు

అరుంధతీ నక్షత్ర వీక్షణాలు..

కన్నీటి కడలిలో అప్పగింతల తతంగం...

ఒకటా.. రెండా ...ఆహా!ఆ కమనీయ దృశ్యాలు...

అలనాటి వివాహ వైభవo వర్ణనాతీతం...

మరి నేటి పెళ్లిళ్లలో సందడులన్నీ...

అయ్యాయి కాంతి చిత్రాలకే దాసోహం...

కదిలే చిత్రాలలో బంధీఅయిపోయింది

వివాహ మహూత్సవము..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational