జీవిత ప్రయాణంలో తోడు...!!?
జీవిత ప్రయాణంలో తోడు...!!?
అడుగుతున్నావు ఎంతవరకు
చదివేవు సమాజాన్ని అని...
నిజాయితీగా ఉన్నవాళ్లను
చదివాను ఇప్పటివరకు..
నీవు ఎక్కడా కనిపించలేదు మరి..!
అడుగుతున్నావు ఎంతమందికి
చేరింది తమరి భావం అని...
మనసు పెట్టి చదివేవారందరికి చేరిందది..
నీకు చేరలేదేమో మరి...!
అడుగుతున్నావు ఎంతకాలం
వేచి చూస్తావు అని..
కాలం ఆగిపోయే అంతవరకు
వేచి చూస్తాను, నీకు అంత
ఓర్పు లేదేమో మరి...!
అడుగుతున్నావు కఠిన
శిలలా మారావెందుకని..
ఒకరి గుండె గూటిలో జ్ఞాపకమై
నిలిచిపోవాలని, నీవేమన్నా
కారణమవగలని అనుకుంటున్నావా మరి...!
నిజాయితీ లేని మనుషుల మధ్య
కాఠిన్యమైన శిలగా మారినా కూడా
నీ జ్ఞాపకాలను గుండె గుడిలో పదిలంగా
దాచుకుంటూ నా ప్రాణం రుద్రభూమి
చేరేవరకు సాగుతుంది
నా ఈ జ్ఞాపకాల ప్రయాణం...!
నా తోడుగా ఉండగలవా మరి..!?
✍️✍️By Radha
