STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

అమ్మ ఋణం

అమ్మ ఋణం

1 min
321

నేను కణముగా ఉన్నప్పుడే ప్రాణంగా చూసుకుంది

తన మాయ లో నన్ను పదిల పరచుకుంది

ఉమ్మనీటి తోటి నే రక్షణ కవచంగా మార్చింది

నా రూపం చూడకుండానే నన్ను ఇష్టపడింది

నా మనసు తెలియకుండానే నన్ను ప్రేమించింది

అడగకముందే నా ఆకలి దప్పికలు తీర్చింది

అపురూపమైన గాజుబొమ్మలా నన్ను కాపాడుకుంది

తన ప్రేమ అభిమాన అనురాగాల లో ఉక్కిరిబిక్కిరై

తన రుణం తీర్చుకోవడానికి ప్రయాసతో బయటికి

వచ్చిన నాకు తన ప్రేమామృత సుధను చను పాలు గా అందించింది

ప్రతిఫలాపేక్ష లేని ప్రేమను అందించిన నా తల్లి ఋణం ఎలా తీర్చుకోను....

విశ్వప్రేమను అక్షరాలుగా కూర్చి ఇవ్వడం తప్ప.....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational