జీవితం
జీవితం
జీవితం నిత్యసమస్యల వలయం
జీవనం షడ్రుచుల సమ్మేళనం
ఆహ్వానించి ఆస్వాదించడమే
తిరస్కరించక తిరుగుబాటు చేయడమే
కష్టాల కడలిని ఈదడం నేర్చుకో
ఇష్టాల నావలో అందంగా సాగిపో
తుఫానే వచ్చినా సునామే చెలరేగినా
ఎదుర్కొనే సత్తా నీకుందని చాటుకో
ఆశనే శ్వాసగా చేసుకుని జీవించు
కలల సాకారంతో బతుకు సాగించు
కాలం అవకాశం తిరిగి రావని తెలుసుకో
సంకల్ప సాధనతో విశ్వమంతా వశం చేసుకో
