STORYMIRROR

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

4  

Raja Sekhar CH V

Abstract Classics Inspirational

జగన్నాథ జగదీశ్వరులు

జగన్నాథ జగదీశ్వరులు

1 min
293

మనోజ్ఞం మోహనీయం రంగాధరుని మృదుహాసం స్మితహాసం,

నిత్య నవ్యం రమ్యంగా ఉండెను రమాశ్రీ శ్రీరంగనాథుల శ్రీనివాసం,

చక్రధారి శంఖధారి భవ్య దివ్యదర్శనం ఇచ్చెను మనసుకి ఆశ్వాసం,

రాజాధిరాజుని ఉపాసనలో లీనమగువలెను మన ప్రతి శ్వాసప్రశ్వాసం,

చిరకాలం ఉన్నది మన నీలమాధవుని దయాదాక్షిణ్యం మీన విశ్వాసం |౧|

అలంకారప్రియులు మన శ్రీకర శుభంకర శ్యామసుందరులు,

భక్తవత్సులు మన అనంతరూపీ లోకాభిరామ సర్వేశ్వరులు,

సర్వజనులను సంరక్షించెను ధర్మేంద్ర ధారపతి ధరణీధరులు,

సదా కల్పతరువు మన పరంబ్రహ్మ పరమాత్మ పరమేశ్వరులు,

సతతం సమదర్శిగా ఉన్నారు జగదాత్మ జగన్నాథ జగదీశ్వరులు |౨|

శ్రీక్షేత్రం శ్రీమందిర శ్రీదేవి కొరకు అతను శ్రీమంత శ్రీకాంత శ్రీధరులు,

భూమండల భూదేవి కొరకు అతను మదనమోహన మహీధరులు,

గోకుల వృందావనం కొరకు అతను వరద వంశీధరులు గిరిధరులు,

అర్చక ఆరాధకుల కొరకు అతను దీపంకర భవసాగర దామోదరులు,

చరాచర జగత్తుకి అతను శ్రీనాథుల దేవాధిదేవులు హరిహరమూర్తులు |౩|



Rate this content
Log in

Similar telugu poem from Abstract