STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

జాగృతమైన జాతి

జాగృతమైన జాతి

1 min
2

జాగృతమైన జాతి.


సంసారమందున సర్వజనంబులు

సౌఖ్యంబు పొందంగ శాంతి వెల్గ

కరుణతో మెల్గుచు కలివిడిగా ప్రజ

క్రోధ కామంబులఁ గూల్చివేసి

నాశబోతుల నెల్ల నణచి వేయగ జను

లైకమత్యంబుతో నడుగువేయ

సామరస్యంబుగ సజ్జనులను గూడి

జాతి జాగృతమౌచు సాగుచుండ /


తేటగీతి.


చక్కనైనట్టి విద్యలు ఛాత్రులెపుడు

నేర్చుచుండగా పాలకుల్ నీతి తోడ

పేద గొప్పను భేదాలు పెరికి వేసి

ప్రభుత నడుపంగ ధరణికి పర్వదినము.//


తేటగీతి.


యుద్ధభయమును పోగొట్టి నుర్వియందు

ప్రజల కెనలేని సంపదల్ పంచనిపుడు

వచ్చుచున్నదీ నూతన వత్సరమ్ము.

స్వాగతించగ రారండి!జనులు కలిసి.


తేటగీతి.

క్రోధి వత్సరమా! నీవు కొలువు చేసి

కష్ట కాలము పోద్రోలి కలిమి నిడుము!

తల్లి!శుభముల నొసగుచు ధరణి కెల్ల

కావు మమ్మరో!మమ్ముల కరుణ జూపి!//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational