హృదయ శకలాలు
హృదయ శకలాలు
రాస్తూనే ఉంటుంది నా మనసు వేల భాష్యాలు...
ఓడిపోయినవి గెలిచినవి
నవ్వినవి ఏడ్చినవి
కాలం చేసిన గాయపు గురుతులు
మనుషులు ఆడిన వికటాట్టసహాలు
అసలు వదలదు...
హృదయసముద్రంలో శబ్దతరంగాల విన్యాసాలు
ఆవేదనాఆకాశంలో మేఘాల విన్యాసాలు
నా మనసు పలికించే బాధాతప్త భావ విన్యాసాలు
రాస్తూనే ఉంటుంది నా మనసు వేల భాష్యాలు...
అపంశయ్య పైనున్న నా మనసుకు జీవం పోస్తూ
అగ్ని కీలల్లో కాలిపోయిన కాలాన్ని
వెనక్కి తీసుకురాలేక కాల చక్రంతో పాటూ నీర్జీవంగా నడుస్తున్న హృదయ శకలాలతో
నా మనసు నిరంతరం కాలిపోతూనే
రాస్తూనే ఉంటుంది నా మనసు వేల భాష్యాలు...