STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

హాయిగా జీవిద్దాం

హాయిగా జీవిద్దాం

1 min
0

హాయిగా జీవిద్దాం!
(వచన కవిత )

కాలుష్యపు కౌగిట్లో కరుగుతున్నది మన భూమాత
తాళలేని బాధతో తలక్రిందులవుతున్నదీ శ్రీజాత.

చెట్టు చేమలను నరికేస్తే చింత పెరిగి పోతుంది.
చిట్టడవులు లేకపోతే జీవమెట్లు బ్రతుకుతుంది?

వేడిగాలులు వీస్తుంటే ప్రాణులకు భీతి పుట్టుకొస్తుంది.
గోడుమని దిక్కులేని జీవరాశి కుమిలి నలిగి పోతుంది.

 గతిమారిన ఋతుచక్రము కాలమునే మార్చుతోంది.
అతిగా తుఫానులు రావటంతో అవని వణికి పోతోంది.

సునామీలు భూకంపాలు చుట్టుముట్టి వేధిస్తుంటే
క్షణక్షణము కరవుకాటకాలతో జగతి తల్లడిల్లుతోంది.

ప్రాణుల కావాస మైన భూమి భయంకరంగా ఉంది.
దీనతతో మన జీవితాలు జీర్ణదశకు చేరుతున్నాయి.

పరిస్థితిని మార్చుకొందాం!పచ్చదనాన్ని పెంచుకొందాం!
ధరణిని పూజించుకొందాం!తరతరాలు నిలిచియుందాం!
 
నదులను బాగు చేసుకొందాం!భవిష్యత్తును నిర్మిద్దాం!
వదలివేసి ప్లాస్టిక్కును ప్రాణితతి రక్షణకై కదులుదాం!

ప్రతినిమిషం కష్టపడదాం! వసుధకు మేలుకై శ్రమిద్దాం!
బ్రతుకులను దిద్దుకొందాం!హాయిగా నీ ధరపై జీవిద్దాం!//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational