గురు గీతం : కవీశ్వర్
గురు గీతం : కవీశ్వర్
గురు పౌర్ణమి సందర్భంగా: గురు గీతం రచన : కవీశ్వర్ : 13.07.2021
పల్లవి : ఓనమాలు దిద్దించే గురువులండి వారు తల్లిదండ్రులే కాక ఇంకెవరండీ వీరు చరణం: జీవితాన్ని సృజియించి జ్ఞానపథం చూపారు వారు విజ్ఞాన పాఠానికి చుక్కాని వంటి వారు వీరు జనపథాన వెలిసినట్టి ఈ చుక్కాని గురువు గారు ఆ గురువులననుసరించి పయనించే శిష్యులండివీరు \\ ఓనమాలు \\ చరణం 2 : వేదవ్యాసుల రచనల అనుసరణ సరళిలో వేదవేదాంగాల సులభ మార్గమను సూచనలో గురుపూజోత్సవ శుభదినాన జరుగు వేడుకలో బహుముఖ ప్రజ్ఞా శైలిఅనుసరించు గమనంలో \\ ఓనమాలు \\ చరణం 3: విశ్వగురువుల బోధనల ఉత్ప్రేరణ మండీ ఆధ్యాత్మిక గురుదేవుల మార్గదర్శనమండీ గతించిన గురువుల స్మరణేశిష్యుల మార్గమండీ సాంకేతిక ప్రయోగాల అనుసరణమే లక్ష్యమండీ \\ ఓనమాలు \\ : వ్యాఖ్య : పాఠకులందరికీ, గురువులందరికీ గురు పూర్ణిమ / వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు
