గత వైభవం - ప్రస్తుత అవలోకనం రచన : కవీశ్వర్ 💐
గత వైభవం - ప్రస్తుత అవలోకనం రచన : కవీశ్వర్ 💐
అంశం : దేశ భక్తి
శీర్షిక : గత వైభవం - ప్రస్తుత అవలోకనం
రచన : కవీశ్వర్ 💐 ప్రక్రియ : వచన కవితా సౌరభం
తేదీ : 24 . 01 . 2022
గత వైభవం - ప్రస్తుత అవలోకనం : వచన కవితా సౌరభం
మాతృ దేశ ఘనత కన్న తృప్తి ఎక్కడుంది ? సంతృప్తి ఎక్కడుంది?
బాపూజీ, నేతాజీ ,చాచాజీ మొదలైన దేశభక్తులను స్మరణలోఉంది.
గతంలో మన పాఠశాలల్లో మనగురువులు నేర్పిన నడతలోఉంది
బాలల దినోత్సవ పిల్లల చిత్రాలను చూపించడంలో ఉండింది.
అప్పటి చలన చిత్రాలలో తొణికిసలాడింది దేశభక్తి ఇప్పుడెక్కడ?
పలుచలనచిత్ర ప్రదర్శనశాలల్లో వందేమాతరంతోమొదలవుతూ
జనగణమన తో ముగించునంతలో ఒక సమాచార సెల్లులోయిడ్ తో
ఆచిత్రాలలో ఒకటి లేదా రెండు దేశభక్తి ని ప్రేరేపించే సన్నివేశాలతో
చలన చిత్రాలను రూపొందించి దేశభక్తి ని ప్రజలలో రేకెత్తించేవారు
గురువులు జెండావందనంతో పాటుగా ఉదయ కవాతునుచేయించేవారు
ఆ మధుర జ్ఞాపకాలు మన స్మృతిపథంలో ఎల్లప్పుడూ మెదులుతుంటాయి
ప్రహేళికలు, పాటల పోటీలుసేవాఆధారితంగానే తప్పధనార్జనతో లేకుండేవి
ఈ కాలం లో చాలా వరకు ప్రయత్నిస్తున్నా చాలా మందిలో నిర్లక్ష్య ధోరణిలో
నాకేంటట? నేనుమాత్రమెందుకు చేయాలి ?సరియైన మార్గదర్శకత్వం లోపం
ఇప్పటి తరానికి మహాత్ముడంటే ఎవరో,నెహ్రుఅంటే ఎవరో?మాకేమి తెలియదే !
చెప్పినాఅవగాహన చేసుకునే వారుచాలాతక్కువ.మాధ్యమాల వైవిధ్యంఎక్కువ
ప్రణాళికలు , ప్రహేళికలు కొత్తపోకడలతో దేశభక్తిని సంగ్రహ జీవిత చరిత్రలను ,
ప్రముఖ దేశభక్తులు జన్మస్థలాలకు , వారియొక్క ఘనతను తెలిపే ఘటనల ను
అవగాహన యాత్రలను ,స్మరణీయ దర్శనలను నేటి బాలబాలికలకు,యువతకు
ప్రభుత్వ సహకారంతో,క్షేత్ర పర్యటనలను ఉపాధ్యాయులతో పాటుగా తక్కువ-
ఖర్చుతో నిర్వహిస్తే సందర్శకులకు దేశం పై అవగాహన , దేశభక్తి పెరుగుతుంది ||
కవీశ్వర్ :వ్యాఖ్య
" చారిత్రక , ఘనచరిత్రకల ప్రదేశాల క్షేత్ర పర్యటనం-దేశభక్తి అభివృద్ధికి మూలకారణం "
💐🙏💐🇮🇳🙏🇮🇳💐🙏
