గణపతీ
గణపతీ
శంకరోతి శంకరోతి..శక్తి గణపతీ..!
పార్వతీ నందనా..శంకరోతి శంకరోతి..!
నిజధ్యాన సుమప్రియా..నిగమగణపతీ..!
మదంతరంగ శ్రీనివాస మహాగణపతీ..!
విశ్వశాంతి కరోతి..విజయగణపతీ..!
ముఖ్య అతిథి నీవయ్యా మూలగణపతీ..!
హృత్కైలాస దైవతమా..దేవగణపతీ..!
అన్నింట అంతటా..నీవేను సత్యగణపతీ..!
బండారు గణపతీ..బంగారు గణపతీ..
భక్తిపత్రి మెచ్చువాడ భావగణపతీ..!
విచక్షణా జ్ఞానప్రదా..విశేషగణపతీ..!
ఓంకార నాదాత్మా..వేదగణపతీ..!
నిర్మలాత్మ నేత్రప్రదా..నిత్యగణపతీ..!
పర్యావరణ పరిరక్షణ యజ్ఞగణపతీ..!
సమరవాంఛ సంహరా..సాధుగణపతీ..!
సకలలోక రక్షాకర.. సాంబగణపతీ..!
సిద్ధిబుద్ధి గణపతీ..ఆనందగణపతీ..!
