STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Inspirational

గిట్టుబాటు ధర!

గిట్టుబాటు ధర!

1 min
229

గిట్టబాటు ధర!


పగలనక రేయనక..

పాటు పడే రైతు సోదరా!

నీ శ్రమను పోల్చంగా..

ఏదీ సరిపోదు రా!

నీ త్యాగానికి...

ఎవరూ సరి రారు రా!


ఓ రైతన్నా...

నువ్వు ఎందరికో కాదు..

అందరికీ.. ఆదర్శం!


పొలములో మొలకలు వచ్చే వరకు

విత్తు పై నీవు తీసుకొనే శ్రద్ధ!

ఒక తల్లి..తన రక్తపు ముద్దకు

అందమైన రూపాన్ని ఇచ్చేందుకు.. ఆదర్శం!


మొలకలను..

కంటికి రెప్పలా కాపాడేందుకు

నీవిచ్చే...రక్షణ!

సరిహద్దు సైనికుడికి.. శిక్షణ!


మొలక మొక్కగా..

ఎదిగేందుకు నీవు పడే కష్టం!

బిడ్డను పెంచే తండ్రికి..ఆదర్శం!


వాన నీటికోసం...

నిరీక్షణ గా ఎదురు చూసే.. నీ ఓపిక!

లక్ష్య సాధన కోసం..

ఎదురు చూసే సాధకుడికి..ఆదర్శం!


తుఫానుతో తుడిచిపెట్టుకు పోయిన

పంటను చూసి..

ప్రకోపించక చూపే..నీ సహనం!

భూమాతకు సైతం..ఆదర్శం!


నిరాశ చెందక పంటకోసం. 

తిరిగి శ్రమను కొనసాగించే.. నీ ప్రయత్నం!

చదువుకునే..ప్రతి విద్యార్థికీ..

మనుగడ సాగించే..

ప్రతి జీవికి..ఆదర్శం!


ఓ..రైతు సోదర..

నీవు..

మాకు అన్నం పెట్టే.. దొర!

కానీ!

లైట్ చుట్టూ తిరిగి అక్కడే..

ప్రాణాలొదిలే..కరెంటు పురుగుల్లా

పైరు చుట్టూ తిరిగి కరిగి..

ఒరిగిపోతున్న.. ఓ రైతు సోదరా!


ఏదీ..నీ కష్టానికి సరైన..

గిట్టుబాటు ధర!

ఓ..పాలకుల్లారా..

వినపడదా..పుడమి పుత్రుల మొర!


    .......రాజ్.....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy