గెలుపు సంతకం
గెలుపు సంతకం
కాలమనే పరీక్షలో నిలబడి
గెలుపనే విజయాన్ని అందుకోండి
మనసును హింసించి రాయిని మోస్తే
అలుపే తప్ప గెలుపు ఎక్కడుంటుంది..
నీవు చేసే తప్పులకు నెపం చూపకు
మనసే సాక్షిగా ప్రశ్నలు కురిపించు
కడుపులోనిజం కళ్ళల్లో వస్తుంది
గెలువాలన్న తత్వం చిగురిస్తుంది...
గెలుపు సంతకం నీ సొంతమైతే
నీ మాటే అందరికీ శాసనమవుతుంది
ఓడి ఓడి ఉపదేశం బూడిదలో పన్నీరు లా
వినే వారు ఉండరు వింత లోకములో....
మనిషిలోని కసి ఉంటుంది
బూడిద కప్పిన నిప్పును అడిగి చూడు
చీకటిలోని వెలుగు దాగివుంది
ఓటమిలోని గెలుపు కనిపిస్తుంది...
శ్రమతోనే భూమి పండుతుంది
చినుకుతోనే సిరి వస్తుంది
కన్నీరును వదిలితే హృదయం నవ్వుతుంది
గెలుస్తేనే మనిషికి విలువ పెరుగుతుంది...
ఓటమి పునాదులపై గెలుపు సౌధం నిలుస్తుంది
నిరాశను వదిలేస్తే ఆశ బ్రతికిస్తుంది
ఆశలను వదిలి వేస్తే చీకట్లు కమ్ముకున్నాయి
విజయ దీపాలు వెలిగిస్తే దారులు విచ్చుకొన్నాయి..
