STORYMIRROR

Srinivas Cv

Tragedy

4  

Srinivas Cv

Tragedy

గాలి పరుగులు

గాలి పరుగులు

1 min
400

చిలక ఓ చిలక

చిలక పలుకుల చిలక

జామ పండ్లు

జీడి గింజలు

పప్పు అన్నాలు

ఇక, మరువవా నీ అలకలు


చిలక ఓ చిలక

చిలక పలుకుల చిలక

అడ్డుకావు ఏ ఎండలు

తాకలేవు వాన జల్లులు

ఆపు పంజరం తలపు వైపే చూపులు


అంటే, చెప్పింది ఆ చిలకమ్మ


మరచిని చిన్ననాటి స్నేహలు

సొంత ఊర్లొ వేచివున్న తల్లితంద్రులు

అంతు చిక్కని ఊడిగాలు

చెరవాని ప్రపంచాలు


తెలుసుకొలేవు


చెట్టు నీడ కట్టిన గూడ్లు

రెక్కల కింద గాలి పరుగులు

పచ్చటి పొలలొ పచార్లు

నీలి ఆకాశం కై ఎగురులాటలు


Rate this content
Log in

Similar telugu poem from Tragedy